విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
WG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎస్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఆకివీడు మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వీటిని అందజేశారు. సంఘం నాయకులు సూర్యనారాయణ, మీనా సూర్యకుమారి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా చదివి పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపలన్నారు.