పాఠశాలల్లో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉట్టికోట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల బాలికల శ్రీకృష్ణ, గోపికల వేషధారణ, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.