టిప్పర్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

టిప్పర్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద సోమవారం టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో బాధితుడి కుడికాలు విరిగింది. స్థానికులు, పోలీసులు వెంటనే 108కు సమాచారం అందించగా ఈఎంటీ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.