విశాఖ వన్డేలో టీమిండియాలో మార్పులు..?
విశాఖ వేదికగా రేపు జరిగే మూడో వన్డేలో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ రెడ్డి లేదా పంత్ ఆడనున్నట్లు సమాచారం. విశాఖ నితీష్‌కు హోంగ్రౌండ్ కావడంతో అతడు ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విఫలమవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయ బౌలర్ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా అతడినే ఆడించనున్నారు.