ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు

MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. రంగాయపల్లి హైస్కూల్లో విద్యార్థులు జాతీయ నాయకులు నెహ్రూ, స్వామి వివేకానంద, భగత్ సింగ్, రాణి రుద్రమదేవి, భారతమాత వేషధారణతో చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది.