పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలి: కలెక్టర్
KRNL: ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు మరింత పురోగతి సాధించాలని మంగళవారం కలెక్టర్ ఏ. సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, పెండింగ్ లేఅవుట్ పర్మిషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు కమిషనర్లు పాల్గొన్నారు.