పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు..

పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు..

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డికి ఆదేశాల మేరకు మండలంలో బాల గుడబ గ్రామ చివరన ఇవాళ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జీడితోటలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి రూ. 2,23,130 నగదు, రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ఏడు చరవాణులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని చెప్పారు. దాడుల్లో ప్రత్యేక సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.