కుక్కల బెడద.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కుక్కల బెడద.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీలో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదను అరికట్టడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుక్కలకు మైక్రోచిప్‌లను అమర్చాలని నిర్ణయించింది. రానున్న రెండేళ్లలో 10 లక్షల మైక్రోచిప్‌లను అమర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మైక్రోచిప్‌ల వల్ల కుక్కల కదలికలను సులభంగా ట్రాక్ చేయవచ్చని.. వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.