ఈ ఉద్యోగాలకు నేడే లాస్ట్ డేట్

కృష్ణా: గుడివాడ RTC డిపోలో ఔట్ సోర్సింగ్ విధానంలో రోజువారీ వేతనంతో డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. హెవీ లైసెన్స్ పొందిన 18 నెలలు పూర్తై ఉండాలి. బయోడేటా, యాక్సిడెంట్ లేని సర్టిఫికెట్, ఆధార్, లైసెన్స్‌తో 12-08-2025లోపు దరఖాస్తులు సమర్పించాలి. రికార్డుల పరిశీలన అనంతరం వైద్య పరీక్ష, శిక్షణతో ఎంపిక చేస్తారని తెలిపారు.