పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్ల పరిశీలన
GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో స్వయంభూదేవి పోలేరమ్మ తిరునాళ్లు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం రాత్రి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.