అలంకారప్రాయంగా మంచినీటి కుళాయిలు

అలంకారప్రాయంగా మంచినీటి కుళాయిలు

SKLM: ఎల్.ఎన్.పేట మండలంలోని పలు గ్రామాల్లో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కుళాయిలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. వీటి నుంచి చుక్క నీరు రాకపోవడంతో మండలంలోని తురకపేట, యంబరాం, బొర్రంపేట, ముంగన్న అగ్రహారం, మిరియాపల్లి, దబ్బపాడు తదితర గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.