అమరవాయి వాగును సందర్శించిన ఎంపీడీవో

GDWL: మానవపాడు అమరవాయి మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెద్ద వాగును మండల ఎంపీడీవో రాఘవ సందర్శించారు. వాగు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఎటువంటి రాకపోకలు చేయవద్దని ప్రజలకు సూచించారు. అదే విధంగా వాగు ప్రవాహం తగ్గేవరకు రాకపోకలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న కానిస్టేబుల్‌కు సూచించారు.