గోడంను తనిఖీ చేసిన సీఈవో
SRCL: ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం సిరిసిల్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సాధారణ తనిఖీ కోసం ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకున్న సీఈవోకు, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ స్వాగతం పలికారు.