స్మార్ట్ మార్కెట్లు, క్యాంటీన్లపై ఎమ్మెల్యే దగ్గుపాటి సమీక్ష
ATP: నగరంలో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లు, తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులతో సమీక్షించారు. పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించి, ప్రతి ఇంటిపై సోలార్ ప్లాంట్ కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీధి వ్యాపారులకు స్మార్ట్ మార్కెట్ల గురించి వివరించాలని ఆదేశించారు.