VIDEO: మాట నిలబెట్టుకోలేదని రాజీనామా.. వద్దన్న ప్రజలు
MNCL: ఓ కౌన్సిలర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని రాజీనామా చేస్తానని ప్రకటించాడు. చెన్నూర్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ శివకృష్ణ రజకులకు ఇచ్చిన మాట ప్రకారం దోబీఘాట్ పనులు ప్రారంభం కానందుకు రజక సంఘం సభ్యుల వద్దకు వెళ్లి రాజీనామా చేస్తానని తెలిపాడు. అయితే, ఇతర అభివృద్ధి పనులు సాగుతున్నాయని, దోబీఘాట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాజీనామా చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.