విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
NRPT: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంపొందించడం, సృజనాత్మకతను మెరుగుపరచడం పాఠశాలల్లో సరైన శిక్షణ వాతావరణం ఏర్పాటు చేయడంపై సమీక్షించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నవంబర్ 14న జాతీయస్థాయి స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.