VIDEO: రోడ్డుపై విరిగిన చెట్లను తొలగించేది ఎప్పుడు..?
ASF: బెజ్జూర్ మండలం అందుగులగూడ గ్రామ సమీపంలో ఇటీవల ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై పలు చెట్లు విరిగిపడ్డాయి. రెండ్రోజులైనా విరిగిపడ్డ చెట్లను తొలగించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుపై విరిగిన చెట్లను తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.