జిల్లాలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ, ఓబీసీ నాయకులు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే వారి సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఎం విశ్వకర్మ జిల్లా కో ఆర్డినేటర్ బీజేపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, పాండురంగ చారి ఉన్నారు.