కొత్తవలసలో రెచ్చిపోయిన దొంగలు

కొత్తవలసలో రెచ్చిపోయిన దొంగలు

VSP: కొత్తవలస బాలాజీనగర్‌లో శనివారం దొంగతనం జరిగింది. బాధితుడు కృష్ణంనాయుడు వివరాల మేరకు శనివారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఎస్.కోట బంధువులు ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో వస్తువులు చెల్లాచెదురు పడి ఉన్నాయి. సుమారు10తులాల బంగారం, రూ 1.50 లక్షలు నగదు చోరికి గురైనట్లు గుర్తించారు. సోమవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు.