మల్లన్న గుడి అభివృద్ధికి ఎంపీ నిధుల మంజూరు

కరీంనగర్: మల్లాపూర్ మండల కేంద్రంలోని మల్లన్న గుడి కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల ద్వారా మంజూరైన రూ.3 లక్షల ప్రొసీడింగ్స్‌ను గురువారం స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీకి అందించారు. మల్లన్న గుడి అభివృద్ధికి సహకరించిన ఎంపీ అరవింద్‌కు యాదవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.