అంత్యక్రియలకు వెళ్లి అనంత లోకాలకు..!
కోనసీమ: ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన అయినాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు.. ముమ్మిడివరం మండలం అయినాపురంకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలకు గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్లారు. అంత్యక్రియలు అనంతరం గోదావరిలో స్నానం చేస్తుండగా ముగ్గురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ఇద్దరిని రక్షించగా, మట్టపర్తి భాను ప్రసాద్(20) మృతి చెందాడు.