VIDEO: ఉజలంపాడ్ ప్రాజెక్టులో భారీ వరద

SRD: సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్ ప్రాజెక్టులో భారీ వరద చేరింది. దాంతో నిండుకుండలా తలపిస్తుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు నిండిపోయిందని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా అలుగు ద్వారా దిగువకు వరద జలాలు దుంకుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకోవడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.