VIDEO: దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు కృషి: చింతా ప్రభాకర్
SRD: తెలంగాణ తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. శుక్రవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. కొమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి యువతకు ఆయన వీరోచిత చరిత్రను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీసీ మాజీ ఛైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.