ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

NZB: శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.