'బలవంతంగా విరాళాల సేకరణ చేస్తే కేసు నమోదు'

TPT: గణేశ్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జనం కోసం పోలీసుల అనుమతులు తప్పనిసరి అని వెంకటగిరి సీఐ రమణ అన్నారు. బలవంతంగా విరాళాల సేకరణ చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి గొడవలు జరుగకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా వేడుకలు చేసుకోవాలని సూచించారు.