'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు'

'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు'

MNCL: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాత్రి, తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ సమయాల్లో వాహన రాకపోకలు తగ్గించాలని, రోడ్ల పక్కన వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ప్రజలకు సూచించారు.