స్పీకర్‌కు రాఖీ కట్టిన మాజీ ఛైర్మన్

VKB: రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మున్సిపల్ ఛైర్మన్ మంజుల రమేష్ రాఖీ కట్టారు. అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని స్పీకర్ అన్నారు. సంప్రదాయబద్ధంగా రాఖీ పౌర్ణమి జరుగుతుందని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.