నేడు బంద్‌కు పిలునిచ్చిన పలు పార్టీ నాయకులు

నేడు బంద్‌కు పిలునిచ్చిన పలు పార్టీ నాయకులు

WGL: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఇవాళ నర్సంపేటలో బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ జాగృతి పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు నర్సంపేట రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. శంకర్ గౌడ్ మృతితో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.