VIDEO: ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ వేడుకలు
HNK: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రజా కవి, గాయకురాలు విమలక్క హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక రజాక ప్రజలు ఉన్నారు.