పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
నంద్యాల పరిధిలో ఎంపీ డా. బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలు చేపట్టి రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు సోమవారం ప్రారంభించారు. పలు గ్రామాల్లో శంఖుస్థాపనలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తర్తూరులో రోడ్డు ప్రారంభంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నారు. మహిళలకు చీరెలు పంపిణీ చేసి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.