నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు

NLG: సాగర్‌లో రేడియల్ క్రస్ట్ గేట్ల మరమ్మత్తులను అధికారులు ముమ్మరం చేశారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పడుతుండడంతో ఎగువనున్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగర్ క్రస్ట్ గేట్లకు రబ్బరు సీళ్లు, గ్రీజింగ్, రూప్ గ్రీజింగ్, క్రస్ట్ గేట్ల మోటర్లకు వైరింగ్‌లను సరి చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.