గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

కర్నూలు: గోనెగండ్ల మండలం బి.అగ్రహారంలో ముక్కెన్న, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు తలారి రామాంజని (23) గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పోషిస్తూ వ్యవసాయ కూలీగా కష్టపడి జీవనాధారాన్ని నడిపిస్తున్న రామాంజనిని గ్రామస్థులు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.