జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

 సూర్యాపేట శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో ఈనెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఈరోజు ఎస్పీ కోరారు.