సైనికులకు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం

ELR: ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి ఏలూరులోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను బుధవారం ప్రారంభించారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు వీర పరివార్ సహాయత యోజన- 2025 పథకం కింద ఈ క్లినిక్ ఏర్పాటైనట్లు తెలిపారు.