లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

NGKL: వెల్దండ మండలంలోని గానుగగట్టు తండా నుంచి బద్రిగాని తండాకు వెళ్లే రోడ్డు ఇటీవల వర్షాలకు దెబ్బతిని కుంగిపోయింది. ఆదివారం తండా సమీపంలో మైనింగ్ క్వారీ నుంచి పలుగు రవాణా చేస్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఒరిగి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.