చుక్కేసి చిక్కితే.. చిక్కులే
HYD: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా 431 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 325 ద్విచక్ర వాహనదారులు, 86 కార్లు, 16 ఆటోలు, 4 భారీ వాహనదారులు ఉన్నారు. గత వారం పరిష్కరించిన 320 కేసుల్లో 21 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.