అనాథ మహిళలు, వృద్ధులకు సరకుల పంపిణీ

KRNL: హొళగుంద మండలంలో అనాథ వృద్ధ మహిళలు, వికలాంగులకు నిత్యవసర సరకులను ఆదోని స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్ సభ్యులు బుధవారం పంపిణీ చేశారు. సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. గ్రామస్థులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.