నిజాంపేట బస్టాండ్‌కు మోక్షమెన్నడు..?
MDK: మండల కేంద్రంగా మారినా నిజాంపేటలో బస్టాండ్ నిర్మాణం కలగానే మారింది. రామాయంపేట-సిద్దిపేట 765 డీజే ప్రధాన రహదారిపై ప్రయాణికులు షెల్డర్ లేక ఎండకు, వానకు అల్లాడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రయాణ ప్రాంగణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.