కన్నతల్లిని నరికిచంపిన కొడుకు.. ప్రభుత్వంపై YCP విమర్శలు

ELR: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకు మద్యం మత్తులో కిరాతకంగా నడిరోడ్డుపై కత్తితో నరికాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఇవాళ చికిత్స పొందుతూ మరణించారు. కాగా, ఈ వీడియోను Xలో పోస్ట్ చేసిన వైసీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘హత్యల్లో బిహార్‌లా మారిపోయిన ఆంధ్రప్రదేశ్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.