VIDEO: వర్షాలకు నేలమట్టమైన వరి పంట.. ఆదుకోవాలని విజ్ఞప్తి
SRPT: జిల్లాలో ఇటివల కురిసిన వర్షాలు రైతులకు మిగిల్చిన రోదన అంతా ఇంతా కాదు. వర్షాలకు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన చర్లపల్లి యాదగిరి మూడు ఎకరాలు, అంబటి యాదయ్యకి చెందిన నాలుగు ఎకరాల వరి పైరు నేలమట్టం అయిందని సదరు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.