'యువత కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి'
VZM: యువత కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గుర్ల మండలం కొండ గండ్రేడు గ్రామానికి చెందిన బోడసింగి రమణ గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్‌కు ఇటీవల ఎంపికయ్యారు. ఈ సందర్బంగా జిల్లా డీసీసీబీ కార్యాలయంలో బుధవారం ఆయన నాగార్జునను కలిశారు. ఈ మేరకు నాగార్జున రమణను అభినందించి సత్కరించారు.