విద్యుత్ షాక్‌లో గేదెలు మృతి

NLG: శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామ రైతు కోనపాకుల యాదయ్యకు చెందిన రెండు గేదెలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి. గ్రామంలో ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో మేతకు వెళ్లిన గేదెలు మృతి చెందాయని రైతు తెలిపారు. సుమారు రూ 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు యాదయ్య గురువారం తెలిపారు. ప్రభుత్వం తనకు పరిహారం అందించాలని కోరారు.