వరద బీభత్సం.. కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

MLG: భారీ వర్షం కారణంగా తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిన ఘటన బండారుపల్లి - నర్సాపూర్ మధ్య రాళ్లవాగు వద్ద చోటుచేసుకుంది. బండారుపల్లి - నర్సాపూర్ మధ్య రాళ్లవాగుపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈక్రమంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయింది.