VIDEO: డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు
KMM: వైరా మండల కేంద్రంలోని తల్లాడ వెళ్ళే ప్రధాన రహదారిలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డ్రానేజీ కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది. రహదారి పక్కన మురుగునీరు నిల్వ ఉండడంతో తీవ్రమైన దుర్వాసన వెలువడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.