VIDEO: ఆపరేషన్ గజ.. ఏనుగు సేఫ్
CTR: యాదమరి మండలంలోని 12 కంపల్లి డీకే చెరువు సమీపంలో శనివారం రాత్రి మేత కోసం వచ్చిన ఒంటరి ఏనుగు చెరువులోకి దిగడంతో బురదలో ఇరుక్కుపోయింది. బురదలో చిక్కుకున్న ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ప్రోక్లైన్‌తో పాటు కుంకీ ఏనుగులను రంగంలో దింపి ఆదివారం అర్ధరాత్రి దాకా 'ఆపరేషన్ గజ' చేపట్టి ఒంటరి ఏనుగును సేఫ్ చేసింది.