కోక వాండ్ల ఊరులో సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

CTR: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 50వ వార్డులో ఉన్న కోక వాండ్ల ఊరులో గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు సమస్యను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.