అట్టహాసంగా గుత్తి కోట ఉత్సవాలు ప్రారంభం
ATP: గుత్తి కోట ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోట ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ వేడుకల ద్వారా కోట విశిష్టతను భావితరాలకు తెలియజేయడమే కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. నేడు, రేపు సాంస్కృతిక కార్యక్రమాలు జబర్దస్త్ నటుల స్కిట్లు ప్రేక్షకులను అలరించనున్నాయి.