శంకర్ ఫౌండేషన్‌లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

శంకర్ ఫౌండేషన్‌లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

VSP: నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో సంక్రాంతి పండుగను డాక్టర్లు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల్లో ఐక్యత భావం వెల్లివిరిసిందని డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. బంగార్రాజు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ కుమార్, ట్రస్టీలు, అధికారులు, డాక్టర్లు పాల్గొని ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.