వీఆర్వోలకు CS పురం MRO సూచనలు

ప్రకాశం: రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డు ఉన్నవారికి బయోమెట్రిక్ ఈకేవైసీ మీద అవగాహన కల్పించాలని వీఆర్వోలను సీఎస్ పురం తహశీల్దార్ మంజునాథరెడ్డి ఆదేశించారు. తన కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి బి.సంపత్ కుమార్, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. కీలకమైన ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.