వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

కోనసీమ: ముమ్మడివరం మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన గురజాపులంక, కునాలంక, లంకాఫ్ తానే లంక గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకలలో ప్రధాన రహదారి ముంపునకు గురైన ప్రాంతాన్ని సందర్శించి ట్రాక్టర్‌లో పర్యటించారు. వరద బాధితులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.